Asianet News TeluguAsianet News Telugu

షాపింగ్ మాల్ లో తుమ్మిన తెలంగాణ యువకుడు.. హత్య కేసు?

ఒకరోజు నిత్యావసరాల కోసం ఓ ప్రముఖ సూపర్‌ మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడ పదేపదే తుమ్ముతూ.. దగ్గుతూ కనిపించిన ఆ ప్రవాసీయుడిని.. అరబ్బు కుటుంబానికి చెందిన ఓ బాలిక గమనించింది. 
 

telanga youth gets corona positive in Saudi
Author
Hyderabad, First Published Apr 10, 2020, 2:07 PM IST

ఓ తెలంగాణ యువకుడికి పరాయి దేశంలో  కష్టం వచ్చిపడింది. దేశం కానీ దేశంలో ఉంటున్న యువకుడు షాపింగ్ మాల్ కి వెళ్లి తుమ్మాడు. అది కాస్త ఇప్పుడు అతనికి తలనొప్పిగా మారింది. అతనిపై హత్యా యత్నం కేసు నమోదు చేయాలని చూస్తున్నారు.

Also Read డిల్లీ ప్రార్థనల ఎఫెక్ట్: మరో యువకుడికి కరోనా... లక్షణాలు లేకున్నా పాజిటివ్...

పూర్తి వివరాల్లోకి వెళితే... జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు సౌదీ అరేబియాలో సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. సెలవులపై ఇ టీవల స్వదేశానికి వెళ్లి.. కొద్దిరోజుల తర్వాత సౌదీకి వచ్చాడు. ఒకరోజు నిత్యావసరాల కోసం ఓ ప్రముఖ సూపర్‌ మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడ పదేపదే తుమ్ముతూ.. దగ్గుతూ కనిపించిన ఆ ప్రవాసీయుడిని.. అరబ్బు కుటుంబానికి చెందిన ఓ బాలిక గమనించింది. 

అతను తుమ్మిన సమయంలో తుంపర్లు షాపింగ్‌ ట్రాలీపై పడటం, ఆ ట్రాలీ హ్యాండిల్‌ను అతడు పట్టుకోవడం.. ఇదంతా చూసిన ఆ బాలిక అక్కడే ఉన్న తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. వారి సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం ఆ ప్రవాసీయుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. వెంటనే మునిసిపల్‌ అధికారులు సూపర్‌ మార్కెట్‌లో పూర్తిగా క్రిమి సంహారక మందును స్ర్పే చేశారు. ప్రవాసీయుడు తాకిన ర్యాకుల్లోని రూ. 35 లక్షల విలువై సామగ్రిని ధ్వంసం చేశారు. ఆ ప్రవాసీయుడితో కలిసి క్యాంపులో ఉంటున్న మరో 47 మంది విదేశీ కార్మికులను క్వారంటైన్‌కు తరలించారు. 

వారిలో 44 మందికి నెగెటివ్‌ అని తేలడంతో ఈనెల 8వ తేదీన డిశ్చార్జి చేశారు. మరో ముగ్గురిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఉద్దేశపూర్వకంగా కరోనా వైర్‌సను వ్యాప్తి చేసి.. ఇతరులకు ప్రాణ నష్టం కలిగిస్తున్నాడని తేలితే.. ఆ ప్రవాసీయుడిపై హత్య కేసు పెడతామని అధికారులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios