హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం అమరావతికి బయలుదేరారు.ఈ నెల 21వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఏపీ సీఎంను ఆహ్వానించేందుకు కేసీఆర్ వెళ్లారు.

"

సోమవారం మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం నుండి  అమరావతికి వెళ్లారు.  మధ్యాహ్నం విజయవాడకు చేరుకోగానే కేసీఆర్ విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో బేటీ కానున్నారు.

సాయంత్రం ఐదు గంటలకు స్వరూపానంద స్వామి నిర్వహిస్తున్న సరస్వతి పూజలో కేసీఆర్ పాల్గొంటారు.ఇవాళ రాత్రి ఏడున్నర గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి కేసీఆర్ హైద్రాబాద్‌ చేరుకొంటారు.కేసీఆర్ వెంట టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్, మాజీ ఎంపీ వినోద్ కుమార్‌ తదితరులున్నారు.