Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ బడ్జెట్... నిరుద్యోగ భృతి నెలకు రూ.3వేలు

తెలంగాణ సీఎం కేసీఆర్.. శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు.

telanagana budget 2019.. key points from the budget note
Author
Hyderabad, First Published Feb 22, 2019, 12:34 PM IST


తెలంగాణ సీఎం కేసీఆర్.. శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఆయనే స్వయంగా బడ్జెట్ ని చదివి వినిపిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి నాలుగున్నరేళ్లలో అద్భుత విజయాలు సాధించినట్లు కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. అత్యధికంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిదని ఆయన అన్నారు.

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ల కోసం రూ.1450కోట్లు కేటాయించినట్లు ఆయన చెప్పారు. నిరుద్యోగ భృతది కోసం రూ.1810కోట్లు కేటాయించామని చెప్పారు. ఎన్నికల హామీల్లో భాగంగా నిరుద్యోగులకు రూ.3016 భృతి ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆసరా పింఛన్ల కోసం రూ.12,067 కోట్లు కేటాయించామన్నారు.  2018-19 ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు 10.6శాతంగా నమోదైందని చెప్పారు. మొత్తం 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,017కోట్లతో ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios