తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ని సీఎం కేసీఆర్ ఈరోజు ప్రవేశపెట్టారు. కాగా.. ఈ బడ్జెట్ లో ఫించన్లను రెట్టింపు చేసినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాలు బాధితులు, నేత కార్మికులు, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధి గ్రస్థులకు ఇచ్చే నెలసరి పెన్షన్ మొత్తాన్ని రూ.1000 నుంచి రూ.2016కు పెంచుతున్నట్లు కేసీఆర్ చెప్పారు.

అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ రూ.1500 నుంచి రూ.3,016కు పెంచుతున్నట్లు చెప్పారు. వృద్ధాప్య పెన్షన్ కు కనీస అర్హత వయసు 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి పెన్షన్ అందిస్తున్నట్లు ప్రకటించారు.ఆసరా పింఛన్ల కోసం ఈ బడ్జెట్ లో రూ.12,067కోట్లు కేటాయించినట్లు కేసీఆర్ చెప్పారు.