ప్రియుడి వేధింపులు భరించలేక టెక్కీ రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటు చేసుకొంది.

హైదరాబాద్: ప్రియుడి వేధింపులు భరించలేక టెక్కీ రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటు చేసుకొంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

హైద్రాబాద్ లోని మేడిపల్లికి చెందిన టెక్కీ శ్వేత ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమెకు అజయ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.ఈ పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ కూడ పెళ్లి చేసుకోవాలని భావించారు.

తనను పెళ్లి చేసుకొనేందుకు అజయ్ అంగీకరించడంతో శ్వేత ఆనంధానికి అవధులు లేకుండాపోయాయి. అయితే ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు.శ్వేత వ్యక్తిగత ఫోటోలను అజయ్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అయితే ఈ ఫోటోలను డిలీట్ చేయాలని ఆమె కోరింది. అయితే అజయ్ అంగీకరించలేదు. పైగా శ్వేతను బ్లాక్ మెయిల్ చేశాడు.

ఈ వేధింపులు భరించలేక శ్వేత పోలీసులను ఆశ్రయించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో శ్వేత నడుస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకొంది.

బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. అజయ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 


అజయ్