హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది.. భార్యతో గొడవ కారణంగా టెక్కీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. రాంచీకి చెందిన వైశాఖ్ వర్మ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేస్తున్నాడు.

అయితే సోమవారం అతని భార్య సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆమె వెంటనే రాంచీలోని అత్తమామలకు ఫోన్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని... అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అయితే భార్యతో గొడవల కారణంగానే వైశాఖ్ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.