అరబిక్ భాష నేర్పిస్తానని మాయ మాటలు చెప్పి... బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. కాగా... బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడుని అరెస్టు చేశారు. ఈ సంఘటన చాంద్రాయణ గుట్టలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బిహార్ లోని మధుబని జిల్లా బసైతాభారి గ్రామానికి చెందిన అబ్దుల్ ఖయ్యూం(23) ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. జీఎం కాలనీలోని ఉస్మానియా ఘనీ మసీదు సమీపంలో నివసిస్తున్నాడు. కాగా... రెండేళ్లుగా ఇళ్లకు వెళ్లి మరీ అరబిక్ భాష నేర్పిస్తున్నాడు. కాగా... ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన భాష నేర్పిస్తున్నట్లు నటిస్తూనే.. ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

బాలిక కేకలు వేయడంతో.. ఏదో వీడియో చూసి భయపడిందని  సర్ధి చెప్పాడు. అతను క్లాస్ ముగించుకొని వెళ్లిన తర్వాత జరిగిన విషయాన్ని బాలిక తల్లికి వివరించింది. బాలిక  తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.