ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరవెల్లిలో మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా మల్లన్న దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన స్వాగత తోరణాన్ని తలసాని ప్రారంభించారు. తన తండ్రి వెంకటేశ్ యాదవ్ జ్ఞాపకార్థం శ్రీనివాస్ యాదవ్ ఈ తోరణాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, శాసనమండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

"