సిద్ధిపేట: సిద్దిపేట టీఆర్ఎస్ అభ్యర్థి హరీష్ రావు భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. మెుదటి రౌండ్ నుంచి హరీష్ ఆధిక్యత కనబరుస్తున్నారు. మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి హరీష్ రావు 19,925 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. 

హరీష్ రావుకు పోటీగా బరిలో నిలిచిన టీజేఎస్ అభ్యర్థి భవాని రెడ్డి నామమాత్రపు పోటీ ఇస్తున్నారు. మెుత్తానికి ఈ ఎన్నికల్లో హరీష్ రావు రికార్డు మెజారిటీ సాధిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. లక్షకు పైగా మెజారిటీ సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 7వ తేదీన జరిగిన పోలింగ్‌ ఫలితాలు మరికొద్దిసేపట్లో వెల్లడి కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు విధుల్లో సుమారు 40వేలకు పైగా సిబ్బంది ఉన్నారు.