హైదరాబాద్: సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి. 1988 కొడుకు దిద్దిన కాపురం నాటి లిటిల్ సూపర్ స్టార్ కి, 2019 నేటి సూపర్ స్టార్ కి పుట్టిన రోజు శుభాభినందనలు అంటూ విషెస్ తెలియజేశారు. 

అలాగే మహేశ్ కు ఆల్ దిబెస్ట్ కూడా చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విజయశాంతి. ఇకపోతే సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్ట్ చాలా ఆసక్తిరేపుతోంది. 1988లో విజయశాంతి, కృష్ణహీరోహీరోయిన్లుగా కొడుకు దిద్దిన కాపురం సినిమాలో నటించారు. ఆ సినిమాలో మహేశ్ బాబు వారి తనయుడుగా నటించారు. అందువల్ల మహేశ్ బాబును నాటి లిటిల్ సూపర్ స్టార్ అంటూ ఆమె గత చిత్రాన్ని గుర్తు చేశారు. 

అంతేకాదు 2019లో ప్రస్తుతం మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమాలో కూడా విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2019 నేటి సూపర్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

మహేశ్ బాబుతో తనకు ఉన్న అనుబంధం ఈనాటిది కాదని 1988 నుంచి ఉందని తెలియజేశారు ఫైర్ బ్రాండ్ విజయశాంతి. అంతేకాదు 1988లో తాను మహేశ్ తో నటించినప్పుడు లిటిల్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫోటోను, ప్రస్తుతం నటిస్తున్న 2019లో మహేశ్ బాబు ఫోటోలను జత చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు విజయశాంతి.