Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణాలో ఇక స్విగ్గి, జొమాటోలు బంద్!

ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న కాబినెట్ మీటింగ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ... నేటి నుండి హైదరాబాద్ లో ఫుడ్ డెలివరీలు ఉండవని తేల్చేసారు. స్విగ్గి, జొమాటోలను లాక్ డౌన్ పూర్తయ్యేంతవరకు తమ కార్యకలాపాలను ఇక హైదరాబాద్ లో కొనసాగించనీయమని అన్నారు. 

Swiggy and Zomato banned in Telangana till Lockdown is Lifted: KCR
Author
Hyderabad, First Published Apr 20, 2020, 6:44 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న కాబినెట్ మీటింగ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ... నేటి నుండి హైదరాబాద్ లో ఫుడ్ డెలివరీలు ఉండవని తేల్చేసారు. స్విగ్గి, జొమాటోలను లాక్ డౌన్ పూర్తయ్యేంతవరకు తమ కార్యకలాపాలను ఇక హైదరాబాద్ లో కొనసాగించనీయమని అన్నారు. 

ఢిల్లీలో ఒక పిజ్జా డెలివరీ ఏజెంట్ వల్ల 70 కుటుంబాలు క్వారంటైన్ పాలవ్వాల్సొచ్చిందని, ఇంట్లో ఎల్లిపాయి కారమో, పప్పు చారు ఉడకేసుకొని తినడం నయమని కేసీఆర్ అన్నారు. వెరీ వ్యాపారాలను ఆపడం వల్ల ప్రభుత్వం ఆదాయం నష్టపోతున్నప్పటికీ.... ప్రజల ఆరోగ్యం విషయంలో రిస్క్ తీసుకోదల్చుకోలేదు ప్రభుత్వం అని కేసీఆర్ స్పష్టం చేసారు. 

ఇలాంటిదే ఒక సంఘటన హైదరాబాద్ లో కూడా జరిగిన విషయం తెలిసిందే. స్విగ్గిలో పనిచేసే ఒక డెలివరీ బాయ్ కరోనా పాజిటివ్ గా తేలాడు. అతడి తండ్రి మర్కజ్ వెళ్లి వచ్చాడు. అతడిని టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ గా తేలాడు. 

అతడి తండ్రి నుంచి ఈ కుర్రాడికి సంక్రమించిందని అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ సదరు కుర్రాడు మార్చ్ 18 నుంచి 20 వరకు స్విగ్గి డెలివరీలను చేసాడు. కానీ మార్చ్ 21 తరువాత, లాక్ డౌన్ మొదలు ఒక్క డెలివరీ కూడా చేయలేదని స్విగ్య్ యాజమాన్యం తెలిపింది. 

తెలంగాణలో ఏప్రిల్ 20 నుంచి ఎలాంటి లాక్‌డౌన్‌ మినహాయింపులు లేవన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో ఆదివారం కొత్తగా 18 కేసులు నమోదయ్యాయని.. వీరితో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 858కి చేరిందని కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే 21 మంది మరణించారు. అలాగే ప్రస్తుత పరిస్ధితుల దృష్ట్యా రాష్ట్రంలో మే 7 వరకు లాక్‌డౌన్ ఉంటుందని చెప్పారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం 651 మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారని.. వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి 10 రోజులు పడుతోందన్నారు. వరంగల్ రూరల్, యాదాద్రి, సిద్ధిపేట, వనపర్తిలో జీరో కరోనా కేసులు నమోదయ్యాయని కేసీఆర్ ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios