హైదరాబాద్: ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీల రాజీనామాలను తెలంగాణ శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్  గురువారం నాడు  ఆమోదించారు. ఎమ్మెల్సీలుగా ఉంటూనే డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్సీలు పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే.

తెలంగాణ శాసనమండలిలో సభ్యులుగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి, మైనంపల్లి హన్మంత్‌రావులు ఈ ఎన్నికల్లో  పోటీ చేశారు. పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ నుండి, మైనంపల్లి హన్మంత్‌రావు మల్కాజిగిరి నుండి పోటీ చేశారు.

వీరిద్దరూ కూడ ఎమ్మెల్యేలుగా విజయం సాధించడంతో  గురువారం నాడు తమ రాజీనామా పత్రాలను మండలి ఛైర్మెన్ స్వామిగౌడ్‌కు అందించారు. వీరి రాజీనామాలను మండలి ఛైర్మెన్ స్వామి గౌడ్‌ ఆమోదించారు. 

కొడంగల్ నుండి టీఆర్ఎస్  నుండి పోటీ చేసిన పట్నం నరేందర్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డిని ఓడించారు.రేవంత్ రెడ్డిని ఓడించిన రికార్డు పట్నం నరేందర్ రెడ్డికి దక్కుతోంది.

సంబంధిత వార్తలు

ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయున్న టీఆర్ఎస్ నేతలు