హైదరాబాద్‌: టీఆర్ఎస్‌ పార్టీతో బీజేపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందన్న వార్తలను కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ఖండించారు. బీజేపీ టీఆర్ఎస్ పార్టీతో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

తెలంగాణ ఎన్నికల ప్రరచారంలో భాగంగా హైదరాబాద్ చేరుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు. ఇది తెలంగాణనా లేక కేసీఆర్‌ రాజ్యమా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నెలకొన్న పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. 

తెలంగాణను అడ్డుకున్నవారితో కలిసి టీఆర్‌ఎస్‌ పనిచేస్తోందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌తో తాము కలిసే ప్రసక్తే లేదని సుష్మా స్పష్టం చేశారు.అమరుల కుటుంబాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆదుకోలేదని విమర్శించారు. ఒకే కుటుంబం పదవులన్నీ అనుభవిస్తోందని సుష్మాస్వరాజ్‌ ఆరోపించారు.

 

ఈ వార్తలు కూడా చదవండి

సోనియాలా బాధపడను, కేసీఆర్ పై నిప్పులు చెరుగుతా: సుష్మా స్వరాజ్