Asianet News TeluguAsianet News Telugu

సూర్యాపేట జిల్లాకు జాతీయ అవార్డు...

విద్యారంగ అభివృద్దికి పాటుపడుతూ...విద్యార్థులను బడి బాట పట్టేలా,వారికి మెరుగైన విద్య అందేలా విశేష కృషి చేసినందుకు సూర్యాపేట జిల్లా జాతీయ అవార్డును అందుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తూ గతంలో జిల్లా విద్యాకారిణిగా పనిచేసిన వెంకట నర్సమ్మ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆమెకు ఈ అవార్డును అందిచింది. 

suryapet deo venkata narsamma taken national award
Author
Suryapet, First Published Jan 5, 2019, 10:09 AM IST

విద్యారంగ అభివృద్దికి పాటుపడుతూ...విద్యార్థులను బడి బాట పట్టేలా,వారికి మెరుగైన విద్య అందేలా విశేష కృషి చేసినందుకు సూర్యాపేట జిల్లా జాతీయ అవార్డును అందుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తూ గతంలో జిల్లా విద్యాకారిణిగా పనిచేసిన వెంకట నర్సమ్మ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆమెకు ఈ అవార్డును అందిచింది. 

సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడం కోసం డీఈవో వెంకట నర్సమ్మ వినూత్న కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారు. ''పడే సూర్యాపేట-బడే సూర్యాపేట'' పేరుతో విద్యార్థుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మెరరుగైన భవిష్యత్ కోసం చదువు ఎంత ముఖ్యమో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడింది. బాలకార్మికులుగా మారిన చిన్నారులను మళ్లీ స్కూలు బాట పట్టడంలో, వారి విద్యా సామర్థ్యాన్ని పెంచడంలో ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడింది. 

సూర్యాపేట జిల్లాగా ఏర్పడిన తర్వాత మొదటి డీఈవోగా బాధ్యతలు చేపట్టిన వెంకట నర్సమ్మ ఈ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేశారు. దీంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో,విద్యా వ్యవస్థలో  చాలా మార్పులు వచ్చాయి. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జిల్లాకు కేంద్రం నేషనల్‌ అవార్డు ఫర్‌ ఇన్నోవేషన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషనల్‌ అడ్మినిస్ట్రేషన్ విభాగం అవార్డుకు ఎంపికచేసింది. 

నిన్న శుక్రవారం దేశ రాజధాని డిల్లీలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో డీఈవో వెంకట నర్సమ్మ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ చేతులమీదుగా అవార్డును స్వీకరించారు. తన ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును అందించడం ఆనందంగా  ఉందన్నారు. తాను ప్రస్తుతం డీఈవోగా విధులు నిర్వర్తిస్తున్న హైదరాబాద్ లో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావిదానాన్ని మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తున్నట్లు వెంకటనర్సమ్మ వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios