భారత్- చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణలో మరణించిన ముగ్గురు జవాన్లలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒకరు ఉన్నారు. సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ ఈ ఘటనలో మరణించినట్లు ఆర్మీ అధికారులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

విజయనగరంలోని కోరుకొండ సైనిక్ స్కూల్‌లో చదువుకున్న ఆయన బీహార్ 16వ బెటాలియన్‌లో పనిచేస్తున్నారు. ఏడాదిగా చైనా సరిహద్దుల్లో పనిచేస్తున్న సంతోష్‌కు మూడు నెలల క్రితమే హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యింది.

Also Read:చైనా సరిహద్దు వెంట ఉద్రిక్తత: భారత కల్నల్ సహా ముగ్గురు మృతి, 1975 తరువాత ఇదే తొలి మరణం!

అయితే లాక్‌డౌన్ కారణంగా ఆయన చైనా సరిహద్దుల్లో పనిచేస్తున్న సంతోష్ మంగళవారం చైనా బలగాల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. కాగా ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిష్ఞ (9), కుమారుడు అనిరుధ్ (4) ఉన్నారు.

కాగా లడఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద చైనా సరిహద్దుల్లో భారత్- చైనా సైన్యం బాహాబాహీకి దిగాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకోవడంతో మనదేశానికి చెందిన ముగ్గురు సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న క్రమంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లుగా భారత సైన్యం ప్రకటించింది.