Asianet News TeluguAsianet News Telugu

కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ తేదీల్లో మార్పు.. 24న కాదు, 27న విచారణ

ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ విచారణ తేదీల్లో మార్పు చోటుచేసుకుంది. తొలుత ఈ పిటిషన్ 24వ తేదీన విచారిస్తారని కోర్టు పేర్కొంది. కానీ, తాజా షెడ్యూల్‌లో ఈ పిటిషన్ విచారణ 27వ తేదీన జరుగుతుందని తెలిసింది.
 

supreme court hearing date of brs mlc kalvakuntla kavitha petition changed to 27th of march kms
Author
First Published Mar 23, 2023, 7:49 PM IST

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తునకు సంబంధించి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారణ తేదీల్లో మార్పు జరిగింది. కవిత పిటిషన్ పై 27న సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించనుంది. తొలుత ఈ పిటిషన్ విచారణ రేపే అంటే 24వ తేదీన జరుగుతుందని షెడ్యూల్ పేర్కొంది.

ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసులో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పలువురి కీలక నేతలను దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా ఈడీ ప్రశ్నించింది. 

ఈ సందర్భంగానే ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈడీ తనకు పంపిన సమన్లు రద్దు చేయాలని, తనకు వ్యతిరేకంగా అరెస్టు వంటి చర్యలేవీ తీసుకోవద్దని, అలాగే.. మహిళైన తనను ఇంటి వద్దే విచారించాలని కోరుతూ పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్‌ను 24వ తేదీన చీఫ్ జస్టిస్ సారథ్యంలోని ధర్మాసనం విచారిస్తుందని పిటిషనర్‌కు తెలిపింది. కానీ, తాజాగా, ఈ తేదీలో మార్పు జరిగింది. సుప్రీంకోర్టు వెబ్‌సైట్ క్లారిటీ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం కవిత పిటిషన్‌ను ఈ నెల 27వ తేదీన విచారించనుంది. కవిత పిటిషన్‌ ఐటెం 36గా లిస్ట్ అయింది.

Also Read: ప్రధాని మోడీతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి భేటీ.. ‘కొన్ని మీడియాకు చెప్పకూడదు’

ఈడీ సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తమ వాదన వినేంత వరకు కవిత పిటిషన్ పై నిర్ణయం తీసుకోవద్దని ఈడీ సుప్రీంకోర్టును అభ్యర్థించింది. దీంతో సుప్రీంకోర్టు విచారణపై ఆసక్తి నెలకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios