తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కేటీఆర్ చాలా బిజీ అయిపోయారు. పార్టీ  కోసం ఆయన నిర్విరామంగా కృషి చేస్తున్నారు. అంత బిజీలో కూడా ఆయన సోషల్ మీడియాకి ఎంతో కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అభిమానులతో, ప్రజలతో ట్విట్టర్ వేదికగా టచ్ లో ఉంటూ.. వారి సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారు.

తాజాగా... కేటీఆర్ ట్విట్టర్ లో ఓ ఫన్నీ వీడియోని పోస్టు చేశారు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఎంతో కష్టపడి కంచెకు అవతలివైపు ఉన్న ఫోన్‌ను తీయడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ క్రమంలోనే ఫోన్‌ను తీయడానికి ఉపయోగిస్తున్న కర్ర చేయిజారి కంచెకు అవతలివైపు పడిపోతుంది.

ఆ పక్కనే ఉన్న మరో వ్యక్తి కంచె దాటి అవతలివైపు దూకి ఫోన్‌ను కాకుండా కర్రను తీసిచ్చి వచ్చేస్తాడు. సరదాగా ఉన్న ఈ వీడియోకు నెటిజన్లు సైతం తమ కామెంట్లతో నవ్వులు పూయిస్తున్నారు. ఇక కేటీఆర్‌ కూడా స్మార్టెస్ట్‌ గై అవార్డు గోస్‌ టూ.. అంటూ ఈ వీడియోను పోస్ట్‌ చేశారు.

ఈ వీడియోకి నెటిజన్ల దగ్గర నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అలాంటి మరికొన్ని వీడియోలను కేటీఆర్ కి రిప్లైగా నెటిజన్లు పోస్టు చేయడం విశేషం. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి.