Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ మహిళా కమీషన్ ఛైర్మన్‌గా సునీతా లక్ష్మారెడ్డి

రాష్ట్ర మహిళా కమీషన్‌‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమీషన్ ఛైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని నియమించారు. ఆమెతో పాటు మరో ఆరుగురిని సభ్యులుగా నియమించింది. ఈ కమీషన్ ఐదేళ్ల పాటు పదవిలో ఉంటుంది. 

sunitha lakshma reddy appointed as telangana womens commission chairperson ksp
Author
Hyderabad, First Published Dec 27, 2020, 9:49 PM IST

రాష్ట్ర మహిళా కమీషన్‌‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమీషన్ ఛైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని నియమించారు. ఆమెతో పాటు మరో ఆరుగురిని సభ్యులుగా నియమించింది. ఈ కమీషన్ ఐదేళ్ల పాటు పదవిలో ఉంటుంది. 

సభ్యులుగా షహీనా అఫ్రోజ్, కుమ్ర ఈశ్వరీ భాయ్, కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుధామ్ లక్ష్మీ, కటారి రేవతీ రావు నియమితులయ్యారు.

సునీతా లక్ష్మారెడ్డి వరుసగా మూడు సార్లు (1999, 2004, 2009) కాంగ్రెస్‌ నుంచి నర్సాపూర్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో సీపీఐకి చెందిన చిలుముల కృష్ణారెడ్డిపై 13,274 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి హ్యాట్రిక్‌ రికార్డు సొంతం చేసుకున్నారు.

అయితే 2014 సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నిక, ఆ తర్వాత ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అనంతరం కాంగ్రెస్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న ఆమె గతేదాది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.  
 
Follow Us:
Download App:
  • android
  • ios