హైదరాబాద్: భార్యను అత్యంత దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని మూటలో కట్టి నిర్మానుష్యప్రదేశంలో దుండగుడు పారేశారు. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటు చేసుకొంది.

హైద్రాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో స్రవంతి అనే మహిళను భర్త శేఖర్ తలపై కొట్టి చున్నీతో ఉరి బిగించి హత్య చేశాడు,.  అనంతరం శవాన్ని మూటలో కట్టి తాము ఉంటున్న భవనం పక్కన ఖాళీ ప్రదేశంలో వేసి నిందితుడు పారిపోయాడు.

ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

శేఖర్ తన భార్య స్రవంతిని ఎందుకు హత్య చేశాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరి మధ్య గొడవలు జరిగాయా... ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.