రోడ్డు ప్రమాదంలో టెక్కీ దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నర్సింహారెడ్డి నగర్‌కు చెందిన నటేషన్‌ (39) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 

రోడ్డు ప్రమాదంలో టెక్కీ దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నర్సింహారెడ్డి నగర్‌కు చెందిన నటేషన్‌ (39) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం తన యాక్టివా మీద ఎలక్ట్రీషియన్‌తో కలిసి ఎలక్ట్రికల్‌ సామాన్లు తీసుకొని ఇంటికి తిరిగి వెళుతున్నాడు. ఈ క్రమంలో ఆర్‌.కె.నగర్‌ వద్ద ఆర్టీసీ బస్సు వీరు ప్రయాణిస్తున్న యాక్టీవాను ఢీ కొట్టడంతో నటేషన్ అదుపుతప్పి బస్సు కింద పడిపోయాడు.

బస్సు వెనుక చక్రం తల మీద వెళ్లడంతో నటేషన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే వెనుక కూర్చొన్న ఎలక్ట్రీషియన్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటానస్థలికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నటేషన్‌ భార్య ప్రవీణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు