రాజన్న సిరిసిల్ల ఎస్పీ జిల్లాలో ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే అందరికంటే ముందు ఉంటున్నారు. కరోనా సమయంలో కూడా జిల్లాలో ఉన్న ఎందరో వలస కార్మికులకు రెండు నెలలకు సరిపడా నిత్యావసరసరకులను అందిస్తూ వాళ్లందరికీ ఎటువంటి ఇబ్బందిరాకుండా  చూసుకున్నారు. 

"

వాళ్లకు ఏదైనా అవసరం వస్తే జిల్లాలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఆ కంట్రోల్ రూమ్ కి సమాచారం అందేలా ఏర్పాట్లు చేసి వాళ్ళ ప్రతి అవసరాన్ని తీర్చేలా చేసి జిల్లా ప్రజల ప్రేమ చూరగొన్నారు.

ఆ మధ్య జిల్లా కేంద్రం సిరిసిల్లలో తల్లిదండ్రులు చనిపోయిన ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా మారారన్న విషయం స్థానిక విలేఖరుల ద్వారా తెలుసుకొని తానే స్వయంగా ఒక ఇల్లు కట్టించి ఇచ్చి ఆ అనాధలకు ఒక ఆశ్రయం కల్పించారు. అప్పట్లో ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి స్వయంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ను అభినందించారు. 

మళ్ళి తాజాగా సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన మ్యాకల లక్ష్మి, రామయ్య ల పెద్ద కొడుకు రాహుల్ (27) అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ, రేపో మాపో చావు కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆ కుటుంబానికి తన సొంత డబ్బు 50,000 రూపాయల నగదును అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. 

అంతేగాక ఆ కుటుంబానికి 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందించారు. హైదరాబాద్ లోని కొందరు డాక్టర్ లతో మాట్లాడి మంచి వైద్యం అందేలా చూస్తామని హామీ ఇచ్చి, వెంటనే హైదరాబాద్ లో ఆస్పత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఎవరి ఏ ఆపద వచ్చినా  స్వయంగా ఎస్పీ ఏ ముందుండి సహాయం పట్ల జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.