టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ నిప్పులు చెరిగారు. తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ అరాచక పాలన అందించారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్ననవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రజల కోసం ప్రభుత్వాలు ఉండాలి కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేసీఆర్ ఫ్యామిలీ కోసమే ఏర్పడినట్లు ఉందన్నారు. 

హైదరాబాద్: టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ నిప్పులు చెరిగారు. తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ అరాచక పాలన అందించారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్ననవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రజల కోసం ప్రభుత్వాలు ఉండాలి కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేసీఆర్ ఫ్యామిలీ కోసమే ఏర్పడినట్లు ఉందన్నారు. 

కేసీఆర్ ఏనాడు సెక్రటేరియట్ కు వెళ్లరని ప్రజల సమస్యలు పట్టవంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సిద్ధూ. రూ.300కోట్ల బంగ్లా నుంచి కేసీఆర్ బయటకు రాడని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ తో ఇస్తే దాన్ని కాస్త అప్పులపాల్జేశారని మండిపడ్డాపరు. నాలుగున్నరేళ్లలో కేసీఆర్ ఆస్తులు 400 రెట్లు పెరిగాయన్నారు. 

తెలంగాణలో కేసీఆర్ ఆలీబాబా అయితే నలుగురు దొంగలు కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ లని ధ్వజమెత్తారు. తెలంగాణలో మహిళా సాధికారికత అంటే కవిత ఒక్కటేనా అంటూ విమర్శించారు. 

మరోవైపు ప్రధాని నరేంద్రమోదీపైనా సిద్ధూ విరుచుకుపడ్డారు. మోడీ రైతులకు రుణాలు ఇవ్వరని ఎన్నికల్లో మాత్రం హామీలు ఇస్తారంటూ ధ్వజమెత్తారు. అంబానీ, అదానీ కంపెనీలకు మాత్రం రుణాలు మాఫీ చేస్తారని ఆరోపించారు. మోడీ ఏ దేశమైనా వెళ్లొచ్చా కానీ తాను మాత్రం పాకిస్తాన్ వెళ్తే తప్పా అంటూ నిలదీశారు.