Asianet News TeluguAsianet News Telugu

వికారాబాద్ జిల్లాలో వింతరోగం: వందలాది పక్షులు మృతి

వికారాబాద్ జిల్లాలో వింత రోగం కలకలం సృష్టిస్తోంది. వందల సంఖ్యలో కోళ్లు, కాకులు, పిట్టలు మృత్యువాత పడ్డాయి.  దీంతో స్థానికులు భయాందోళనలకు గురౌతున్నారు.

several birds dead in Vikarabad district lns
Author
Hyderabad, First Published Feb 3, 2021, 10:36 AM IST

వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో వింత రోగం కలకలం సృష్టిస్తోంది. వందల సంఖ్యలో కోళ్లు, కాకులు, పిట్టలు మృత్యువాత పడ్డాయి.  దీంతో స్థానికులు భయాందోళనలకు గురౌతున్నారు.జిల్లాలోని ధరూర్ మండలంలోని దోర్నాల్  గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది.  ఈ వ్యాధి పక్కనే ఉన్న మరో మండలానికి పాకింది.  ఈ విషయమై స్థానికులు  అధికారులకు ఫిర్యాదు చేశారు. 

ఇదే గ్రామంలో జంతు కళేబరాలతో ఆయల్ తయారీ చేసే ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీ  కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు అనుమానిస్తున్నారు.  వ్యాధికి గల కారణాలు ఏమిటనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.

పెద్ద ఎత్తున పక్షులు మరణించడంతో స్థానికులు  ఆందోళనగా ఉన్నారు.  ఏ కారణం చేత పక్షులు మరణిస్తున్నాయో అంతు బట్టడం లేదంటున్నారు. పక్క మండలానికి కూడ వెంటనే ఈ వ్యాధి ప్రబలడంతో  ఆ మండలానికి  చెందిన ప్రజలు కూడ ఆందోళ చెందుతున్నారు. 

స్థానికుల ఫిర్యాదుతో అధికారులు ఈ విషయమై ఆరా తీస్తున్నారు.  పశుసంవర్థక శాఖ అధికారులు  చనిపోయిన పక్షుల కళేబరాలను పరీక్షించనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios