హైదరాబాద్: తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. 

వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు, లారీ, ఆటోలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలంలో విషాదకరమైన వాతావరణం నెలకొంది. 

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోనూ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిత్తూరు జిల్లాలోని పాకాల మండలం నేండ్రగుంట వద్ద శనివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. 

లారీ, ఒమ్మి వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఐదుగురు మరణించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. 

మృతులను రాజమ్మ (80), అన్నపూర్ణ (60), జ్యోతి (14)లుగా గుర్తించారు. మృతులు కర్ణాటకలోని నంగరి మండలం తొండపల్లి గ్రామానికి చెందినవారు.