హైద్రాబాద్ ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని భోలక్‌పూర్ లో పోలీసులతో వాగ్వాదానికి ఎంఐఎం కార్పోరేటర్ విషయ మరువకముందే అదే తరహా ఘటన మరోటి చోటు చేసుకొంది. పాతబస్తీలోని మొఘల్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులతో ఎంఐఎం కార్పోరేటర్ సుహైల్ ఖాద్రీ గొడవకు దిగారు.
హైదరాబాద్: నగరంలో భోలక్‌పూర్ కార్పోరేటర్ గౌసుద్దీన్ వ్యవహరం మరువకముందే పాతబస్తీలో మరో ఎంఐఎం కార్పోరేటర్ కూడా పోలీసులతో దురుసుగా వ్యవహరించారు. ఈ విషయమై దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పాతబస్తీలోని మొఘల్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకొంది.
Old Cityలోని Unani ఆసుపత్రి వద్ద వాహనాల పార్కింగ్ విషయమై ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. నో పార్కింగ్ జోన్ లో రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు అందింది.ఈ ఫిర్యాదు ఆధారంగా యునానీ ఆసుపత్రికి వచ్చిన పోలీసులతో స్థానిక కార్పోరేటర్ Sohail Quadri వాగ్వాదానికి దిగారు. ఇక్కడ ఇలానే ఉంటుందని చెప్పారు. రోడ్డుపైనే వాహనాలు నిలిపిన విషయమై పోలీసులు ప్రశ్నిస్తే కార్పోరేటర్ వారితో దురుసుగా సమాధానం చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన యునానీ ఆసుపత్రిపై కూడా దురుసుగా మాట్లాడారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలోని Bhholakpur లో కానిస్టేబుల్ తో దురుసుగా వ్యవహరించిన ఎంఐఎం కార్పోరేటర్ గౌసుద్దీన్ విషయమై మంత్రి కేటీఆర్ స్పందించారు. MIM కార్పోరేటర్ పై చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి డీజీపీని ఆదేశించారు. దీంతో భోలక్‌పూర్ కార్పోరేటర్ గౌసుద్దీన్ ను పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. బుధవారం నాడు రాత్రి పాతబస్తీలోని యునానీ ఆసుపత్రి వద్ద ఎంఐఎం Corporator సుహెల్ ఖాద్రీ గొడవకు దిగారు.
