హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు బాలగంగాధర్ గుండెపోటుతో శనివారం ఉదయం మరణించారు. ఆయన వయస్సు 62 ఏళ్లు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన అకస్మికంగా మరణించారు. 

ఆయన ఉదయం తెలుగు దినపత్రికలోనూ, ఇతర పత్రికల్లోనూ పనిచేశారు. జీ న్యూస్ టెలివిజన్ చానెల్ లో న్యూస్ ఎడిటర్ గా కూడా పనిచేశారు. ఆయన అంత్యక్రియలు మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో గల మహాప్రస్థానంలో జరుగుతాయి.

ఆయన మృతికి బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.