తాను చేసిన వంట భర్త బాలేదు అన్నాడని ఓ ఇల్లాలు ఆత్మహత్య చేసుకుంది. తాను ఎంతో ప్రేమగా చేసిన వంట బాగోలేదని చెప్పడాన్ని ఆమె భరించలేకపోయింది. మనో వేదనకు గురైంది. దీంతో... ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆమె వారం రోజుల కిందట ఆత్మహత్యకు పాల్పడగా..గమనించిన భర్త వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాడు.  వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. ఈ సంఘటన వికారబాద లో చోటుచేసుకుంది.

 పూర్తి వివరాల్లోకి వెళితే... వికారాబాద్‌ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన బళ్లారి కవితకు(21) రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు భర్త అంటే అమితమైన ప్రేమ. తన చేతితో  రుచిగా వంట చేసి భర్తకు పెట్టాలని ఆమె భావించింది. ఇందులో భాగంగా ఈ నెల 1వ తేదీన భర్తకు ఇష్టమైన వంటకాలు చేసింది. అయితే...  కవిత భర్త ఈనెల 1న ఆమె చేసిన వంట బాగాలేదన్నాడు. 

తాను ప్రేమగా చేసిన వంట భర్త బాలేదు అనడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. దీంతో కవిత ఆత్మాహుతి చేసుకొంది. కవితను గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.