కామారెడ్డి జిల్లాలో కీచక ప్రధానోపాధ్యాయుడు గుట్టు రట్టయ్యింది. ఆన్‌లైన్ క్లాసుల పేరుతో విద్యార్ధినులు ప్రధానోపాధ్యాయుడు దీప్లారాథోడ్ వేధిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.

విద్యార్ధినుల నెంబర్లు తీసుకున్న ఉపాధ్యాయుడు అందాలు చూపించాలంటూ వీడియో కాల్స్‌లో వేధించాడు. అలాగే డ్యాన్స్ క్లాసుల పేరుతో విద్యార్ధినులను వేధించినట్లుగా ఇతనిపై ఆరోపణలు వున్నాయి.

కరోనా సమయంలో విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాస్‌లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న దీప్లా.. బాలురతో పాటు బాలికలకూ పాఠ్యాంశాలు బోధించాడు.

అలా ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో పలువురు విద్యార్థినిల ఫోన్ నెంబర్లను ప్రధానోపాధ్యాయుడు దీప్లా సేకరించాడు. క్లాసుల అనంతరం విద్యార్థినులకు వీడియో కాల్ చేసి.. అసభ్యకర రీతిలో మాట్లాడేవాడు. దీప్లారాథోడ్ తీరుపై మండిపడ్డ విద్యార్ధినుల తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు.