బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు  సతీష్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుటే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు సతీష్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుటే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

సతీష్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవరకొండ బస్తీలో నివాసం ఉంటున్నాడు. సతీష్ తో పాటు ఆయన సోదరుడికి మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి.ఈ గొడవల నేపథ్యంలో సతీష్ పై ఆయన సోదరుడు ఫిర్యాదు చేశాడు

ఈ ఫిర్యాదుపై పోలీస్ స్టేషన్ కు చేరుకొన్న సతీష్ ఈ విషయమై తనపై కేసు నమోదైన విషయం తెలుసుకొన్న సతీష్ మనోవేదనకు గురై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.

పోలీసులు మంటలను ఆర్పి అతడిని ఆసుపత్రికి తరలించారు.