తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. నందమూరి సుహాసినీకి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ పేర్కొన్నారు.

మహాకూటమి లో భాగంగా కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని ఎన్నికల బరిలో దిగిన సంగతి తెలిసిందే. కాగా..శనివారం కూకట్‌పల్లిలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేసి.. సుహాసిని గెలుపు కోసం కృషి చేయాలని సర్వే పిలుపునిచ్చారు.

టీడీపీ నేత పెద్దిరెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన సుహాసినిని మన ఆడబిడ్డగా ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. కూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని మాట్లాడుతూ ప్రస్తుతం నడుస్తున్న రాక్షస పాలనకు చరమగీతం పలకాలన్నారు. తనను గెలిపిస్తే స్థానికంగా ఉండి సేవ చేస్తానని, మహిళలకు అండగా ఉంటానని తెలిపారు