కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని.. యువకుడి ఇంటికి నిప్పంటించిన సర్పంచ్...

తన కూతురు ప్రేమపెళ్లి చేసుకుందని.. యువకుడి ఇంటికి నిప్పంటించాడో గ్రామ సర్పంచ్. దీంతో ఇటిక్యాల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. 

sarpanch set on fire mans house over daughters love marriage in itikyala, warangal - bsb

వరంగల్ : వరంగల్ జిల్లా ఇటిక్యాలలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇటిక్యాల సర్పంచ్ కూతురు ఓ యువకుడిని ప్రేమ పెళ్లి చేసుకుంది. ఇది కులాంతర వివాహం కావడంతో సర్పంచ్ కోపానికి వచ్చాడు. ఆ యువకుడి ఇంటికి నిప్పంటించాడు. వారి పెళ్లికి సహకరించిన స్నేహితుల ఇళ్లకు కూడా నిప్పంటించాడు. దీంతో గ్రామంలో తీవ్రం ఉద్రికత్తలు చోటు చేసుకున్నాయి.

కొద్ది రోజుల క్రితం సర్పంచ్ కూతురు, గ్రామానికి చెందిన రంజిత్ అనే యువకుడిని ప్రేమించి.. ఇంట్లో నుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తరువాత తండ్రి ఇలాంటిదేదో చేస్తాడన్న అనుమానంతో సెల్ఫీ వీడియో కూడా విడుదల చేసింది. అందులో తాను తన ఇష్టపూర్వకంగానే అతడితో వెళ్లి పెళ్లి చేసుకున్నానని తెలిపింది. 

తాను హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చింది. మీరు సంతోషంగా ఉండండి.. నన్ను హ్యాపీగా గా ఉండనివ్వండి.. అని కోరింది. నన్నెవ్వరూ ఇబ్బంది పెట్టలేదు. నా వల్ల మీరు ఇబ్బంది పడకండి.. ఎవ్వరికీ, ఎలాంటి హానీ చేయకండి అని కోరింది. అయినా, ఈ రోజు ఉదయం సర్పంచ్ రంజిత్, అతని స్నేహితుల ఇళ్లకు నిప్పంటించడంతో గ్రామంలో తీవ్ర ఆందోళన వాతావరణం ఏర్పడింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios