ఖమ్మం: ఖమ్మం జిల్లాలో  ఆర్టీసీ కార్మికులు  తమ ఆందోళనను ఉధృతం చేశారు. మేయర్ కారును కార్మికులు అడ్డుకొన్నారు. కార్మికుల ఆందోళనను పట్టించుకోకుండా కారును ముందుకు  తీసుకెళ్లడంతో  ఓ కార్మికుడికి గాయాలయ్యాయి.

సోమవారం నాడు ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికులు  తమ ఆందోళనను  తీవ్రం చేశారు. ఈ ఆందోళన చేస్తున్న సమయంలో ఖమ్మం మేయర్ కారు అటుగా వచ్చింది. దీంతో మేయర్ ను కార్మికులు అడ్డుకొన్నారు.  తమ సమ్మెకు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మేయర్ కారును కార్మికులు అడ్డుకొన్న విషయం తెలుసుకొన్న పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులకు, ఆర్టీసీ కార్మికుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకొంది. పోలీసుల సహాయంతో  మేయర్ కారును ముందుకు వెళ్లింది. 

అయితే ఆ సమయంలో ఓ కార్మికుడికి కారును ఢీకొట్టింది. దీంతో కార్మికుడికి గాయాలయ్యాయి. గాయపడిన కార్మికుడిని  తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.