18న బీఆర్ఎస్‌లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. కేసీఆర్ సమక్షంలో..!

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఊహించినట్టుగానే బీఆర్ఎస్‌లోకి వెళ్లుతున్నారు. సోమవారం కేసీఆర్ సమక్షంలో గులాబి గూడులో చేరుతున్నట్టు ఆర్ఎస్పీ స్వయంగా ప్రకటించారు.
 

rs praveen kumar to join brs tomorrow in the presence of party chief k chandrashekar rao kms

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన భావి అడుగుల గురించి ఓ విషయాన్ని వెల్లడించారు. తాను బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నట్టు స్పష్టం చేశారు. ఇందుకు ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. సోమవారం రోజున అంటే ఈ నెల 18న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబి గూటికి చేరబోతున్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్వయంగా వెల్లడించారు.

ఆదివారం రోజున హైదరాబాద్‌ల తన శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులతో సమావేశమైనట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆ సమావేశంలో అనేక రకాల అభిప్రాయాలు వచ్చాయని, కానీ, తాను ఏ నిర్ణయం తీసుకున్నా వెంట నడుస్తామని వారంతా మాట ఇచ్చారని వివరించారు. 

తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని లౌకికత్వాన్ని కాపాడటానికి, రాజ్యాంగ పరిరక్షణ కోసం బహుజనుల అభ్యున్నతి కోసం తాను బీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కేసీఆర్ సమక్షంలో రేపు(సోమవారం) బీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు పేర్కొన్నారు. 

Also Read: బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ.. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

తాను ఎక్కడున్నా.. బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు. వాళ్ల కలలను నిజం చేసే దిశగానే పయనిస్తానని స్పష్టం చేశారు. జై భీం, జై తెలంగాణ, జై భారత్ పదాలతో తన ప్రకటన ముగించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios