హైదరాబాద్‌లో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. బోరబండ సమీపంలోని అల్లాపూర్‌లో నివసించే నర్సింహదాస్ గౌడ్ అలియాస్ పోచి రౌడీషీటర్.. ఇతనిపై సనత్‌నగర్, ఎస్ఆర్ నగర్‌తో పాటు మరికొన్ని పీఎస్‌లలో కేసులు నమోదై ఉన్నాయి.

ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి శివాజీ నగర్ వద్ద సుమారు 20 మంది వ్యక్తులు పోచిని కత్తులు, గ్రానైట్ రాళ్లతో వెంబడిస్తూ దాడి చేశారు. దుండగుల దాడిలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పాత కక్షలే హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.