హైదరాబాద్ సనత్ నగర్‌లో ఓ రౌడీషీటర్‌ను నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపారు ప్రత్యర్ధులు. రౌడీషీటర్ ఫిరోజ్‌ఖాన్‌కు కళ్లల్లో కారం కొట్టి కత్తులతో నరికి చంపారు దుండగులు. బోరబొండ ఆర్కే సొసైటీకి సమీపంలో రాత్రి పది గంటల సమయంలో జరిగిన ఈ హత్య దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.

హైదరాబాద్ సనత్ నగర్‌లో ఓ రౌడీషీటర్‌ను నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపారు ప్రత్యర్ధులు. రౌడీషీటర్ ఫిరోజ్‌ఖాన్‌కు కళ్లల్లో కారం కొట్టి కత్తులతో నరికి చంపారు దుండగులు.

బోరబొండ ఆర్కే సొసైటీకి సమీపంలో రాత్రి పది గంటల సమయంలో జరిగిన ఈ హత్య దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. మృతుడు ఫిరోజ్ ఖాన్ భూకబ్జా ఆరోపణలతో పాటు రౌడీషీటర్ వహీబ్ హత్య కేసులో అతను నిందితుడు.

ఫిరోజ్‌ఖాన్‌పై సనత్ నగర్ తో పాటు ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లలో కబ్జా ఆరోపణలతో పాటు చాలా కేసులు ఉన్నాయని తెలిపారు. హత్యకు పాతకక్షలే కారణమా? లేక ఇంకేదైనా కోణం ఉందా? అన్న కోణంలో కేసును దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.