మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో తూప్రాన్ నుండి నగరానికి వస్తున్న టిప్పర్  అతివేగంగా  రాంగ్ రూటులో వచ్చి కార్మికులను ఢీకొట్టింది.
 
ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన దశరథ (48)  అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామానికి చెందిన డబిల్ పూర్ లక్ష్మి(50)కి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి, చికిత్స అందజేస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.