కూలీలు వెడుతున్న ట్రాలీని లారీ ఢీ కొట్టడంతో హనుమకొండ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 

వరంగల్ : హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. మరణించిన ముగ్గురు కూడా మహిళా కూలీలు. వారు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పరకాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని పోలీసులు వరంగల్ లో ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. 

పత్తిపాక గ్రామానికి చెందిన 25 మంది మహిళలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా సాయంపేట మండలం మొగుళ్లపల్లి గ్రామంలోని మిర్చితోటలో పనిచేయడానికి వాహనంలో బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. లారీ వీరి వాహనాన్ని సైడ్ నుంచి తగలడంతో ర్యాలీలో సైడ్ నిలబడిన వారందనికీ గుద్దుకుంటూ వెళ్లింది. అలా మహిళా కూలీలు వాహనంలో బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదనికి గురయ్యారు. 

సాయంపేట మండలం మందారిపేట వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 9మందికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పరకాల ఏసీపీ సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని వరంగల్ ఎంజీఎంకు అదే ట్రాలీలో చికిత్స నిమిత్తం తరలించారు. మృతి చెందిన మహిళా కార్మికులను నిర్మల, రేణుక, మంజులుగా గుర్తించారు.