Asianet News Telugu

అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టిన అంబులెన్స్...ఏడుగురు మృతి

ఉత్తర ప్రదేశ్ లో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాణాలను కాపాడాల్సిన ఓ అంబులెన్స్ వేగంగా వెళుతూ అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. ఈ దుర్ఘటనలో అంబులెన్స్ లో ప్రయాణిస్తున్న ఏడుగురు మృత్యువాతపడ్డారు. అలాగే మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
road accident at uttar pradesh
Author
Lucknow, First Published Feb 19, 2019, 6:55 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఉత్తర ప్రదేశ్ లో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాణాలను కాపాడాల్సిన ఓ అంబులెన్స్ వేగంగా వెళుతూ అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. ఈ దుర్ఘటనలో అంబులెన్స్ లో ప్రయాణిస్తున్న ఏడుగురు మృత్యువాతపడ్డారు. అలాగే మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ పేషంట్స్ తో పాటు వారి సహాయకులను తీసుకుని ఆగ్రా నుండి నోయిడాకు బయలుదేరింది. ఆ  క్రమంలో యమునా ఎక్స్ ప్రెస్‌వే పై వేగంగా వెళుతున్న అంబులెన్స్ అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. దీంతో ఇందులో ప్రయాణిస్తున్నవారిలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గరు తీవ్రంగా గాయపడ్డారు.  

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.    

Follow Us:
Download App:
  • android
  • ios