జాతీయ రహదారులపై టీఆర్‌ఎస్ నేతలు నిరసనలు తెలిపితే పోలీసులు అడ్డుచెప్పలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దఅన్నారు. రోడ్లపై, హైవేలు టెంట్‌లు వేసి నిరసన తెలిపిన పోలీసులకు కనిపించలేదా అని ప్రశ్నించారు.
జాతీయ రహదారులపై టీఆర్‌ఎస్ నేతలు నిరసనలు తెలిపితే పోలీసులు అడ్డుచెప్పలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దఅన్నారు. రోడ్లపై, హైవేలు టెంట్‌లు వేసి నిరసన తెలిపిన పోలీసులకు కనిపించలేదా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ నిరసన తెలిపితే రూల్స్ అడ్డురావా అని పోలీసులను ప్రశ్నించారు. కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిస్తే మాత్రం అడ్డుకుంటున్నారని చెప్పారు. అర్ధరాత్రి నుంచి కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లకు తరించారని తెలిపారు. తన ఇంటి చుట్టూ పోలీసులను పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
తాము పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన పౌరులం కాదు.. తాము ప్రజా సమస్యలపై నిరసన తెలపాలని అనుకుంటున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో నిరసన ఒక భాగమని తెలిపారు. ధరలకు వ్యతిరేకంగా, పబ్‌లకు వ్యతిరేకంగా నిరసన చేపట్టినా పోలీసులు అడ్డుకుంటున్నారని అన్నారు.
ధాన్యం కొనుగోలు చేయాలని మోదీపై ఒత్తిడి తెచ్చేందుకు తాము నిరసన చేస్తుంటే కేసీఆర్ ఎందుకు అడ్డుకుంటున్నారు అని ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్ ఇద్దరు దోపిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్, మోదీ ఇద్దరు వేర్వేరు కాదని.. ఇద్దరు తోడు దొంగలని విమర్శించారు. అనంతరం తన ఇంటి నుంచి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి విద్యత్ సౌధ ముట్టడికి రేవంత్ రెడ్డి బయలుదేరారు. కేసీఆర్, మోదీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగుతున్నారు.
ఇక, పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ గురువారం నాడు విద్యుత్ సౌధ ముట్టడికి పిలుపునిచ్చింది. నెక్లె స్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి వద్యుత్ సౌధ వరకు ర్యాలీ నిర్వహించాలని చెప్పింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళనలు నిర్వహించాలని తెలిపింది. హైద్రాబాద్ విద్యుత్ సౌధ ముట్టడిని విజయవంతం చేయాలని కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ Revanth Reddy కోరారు.
విద్యుత్ సౌధ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల ఇళ్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పార్టీ నేతలు ఇళ్ల నుండి బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే విద్యుత్ సౌధ వద్ద ఉద్యోగులను వారి గుర్తింపు కార్డులను చూపించిన తర్వాతే అనుమతి ఇస్తున్నారు.
