Asianet News TeluguAsianet News Telugu

వెనుకంజలో రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ కొడంగల్ అభ్యర్థి రేవంత్ రెడ్డి.. స్వల్ప ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు

revanth reddy not in leading position in kodangal
Author
Hyderabad, First Published Dec 11, 2018, 9:17 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు చాలా మంది వెనుకంజలో పడిపోయారు. కాంగ్రెస్ కొడంగల్ అభ్యర్థి రేవంత్ రెడ్డి.. స్వల్ప ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. మొదటి రౌండ్ వరకు ముందంజలో ఉన్న ఆయన ఇప్పడు కాస్త వెనకపడ్డారు. తన ప్రత్యర్థి పట్నం నాగేందర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ,. జానారెడ్డిలు కూడా వెనుకంజలో ఉండటం గమనార్హం. ఈ ఎన్నికల ఫలితాలు చాలా ఉత్కంఠ గా సాగుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 7వ తేదీన జరిగిన పోలింగ్‌ ఫలితాలు మరికొద్దిసేపట్లో వెల్లడి కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు విధుల్లో సుమారు 40వేలకు పైగా సిబ్బంది ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios