Asianet News TeluguAsianet News Telugu

మరో మూడు రోజుల్లో తెరుచుకోనున్న రెస్టారెంట్లు.. ఎలా కూర్చోవాలి?

లాక్‌డౌన్ త‌రువాత జూన్ 8 నుంచి రెస్టారెంట్లు తెరిచేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. పరిశుభ్రతకు అన్ని రెస్టారెంట్లు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. 

Remembering Eating Out While Reading 'The Restaurant'
Author
Hyderabad, First Published Jun 5, 2020, 12:09 PM IST

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో దేశంలో లాక్ డౌన్ విధించారు. కాగా... ఈ లాక్ డౌన్ తో అన్నీ మూతపడ్డాయి. ఈ లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు చేశారు. కాగా.. జూన్ 8 నుంచి రెస్టారెంట్లు తెరుచుకోనున్నాయి. కరోనా భయంతో చాలా మంది ఇప్పటికిప్పుడు రెస్టారెంట్ కి వెళ్లే అవకాశం లేకపోవచ్చు. అయితే.. అత్యవసర పరిస్థితుల్లోనో, అకేషన్ గానో వెళ్లే అవకాశం రావచ్చు.

అలాంటప్పుడు రెస్టారెంట్ కి వెళ్లినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈసారి మీరు రెస్టారెంట్‌కు వెళ్లిన‌ప్పుడు అక్క‌డ అన్నీ భిన్నంగా క‌నిపించ‌నున్నాయి. మీరు కూర్చునే సీటు నుండి అక్క‌డి వంటగది వరకు అన్ని ప్ర‌త్యేకంగా ఉండ‌నున్నాయి. లాక్‌డౌన్ త‌రువాత జూన్ 8 నుంచి రెస్టారెంట్లు తెరిచేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. పరిశుభ్రతకు అన్ని రెస్టారెంట్లు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. 

ముఖ్యంగా చెఫ్‌ను చీఫ్ హైజినిక్ ఆఫీసర్‌గా మార్చారు. ప్రతి కుక్, ఉద్యోగి ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడంతో పాటు మాస్కులు ధ‌రిస్తారు. సామాజిక దూరం త‌ప్ప‌నిస‌రిగా పాటిస్తారు. రెస్టారెంట్‌కు వచ్చేవారికి థ‌ర్మ‌ల్ చెక‌ప్ చేయ‌నున్నారు. స్వీయ ఆర్డరింగ్ కియోస్క్‌లతోపాటు ఫ్రంట్ కౌంటర్లు, వాష్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. అలాగే ఆహారం తినేందుకు కూర్చొనే కుర్చీల దగ్గ‌క‌ సామాజిక దూరానికి సంబంధించిన‌ మార్కింగ్ ఉంటుంది. ముందుగా రెస్టారెంట్‌లో టేబుల్ బుక్ చేసుకోవాల్సివుంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios