భార్య ఆత్మహత్య కేసులో జైలుకు వెళ్లిన ఓ ఖైదీ ప్రేమికుల రోజుల అదే భార్యను గుర్తుచేసుకుని గుర్తుచేసుకుని తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా జైల్లో చోటుచేసుకుంది.
సంగారెడ్డి: భార్య ఆత్మహత్య కేసులో అతడే ప్రధాన నిందితుడు. కానీ ఇవాళ(ఫిబ్రవరి 14) ప్రేమికుల దినోత్సవం రోజులు భార్య గుర్తుకు వచ్చిందంటూ జైల్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లా (sangareddy district) కు చెందిన భానుచందర్(24) అనే యువకుడి భార్య ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణమని ఫిర్యాదు రావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపర్చారు. కోర్టు బానుచందర్ కు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా జైలులో వున్నాడు.
అయితే ఇవాళ(సోమవారం) జైలు గదిలోనే బెడ్ షీట్ ను ఉపయోగించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే విధుల్లో వున్న పోలీసులు ఇది గమనించి బానుప్రసాద్ ను కాపాడారు. అప్పటికే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగానే వున్నట్లు తెలుస్తోంది.
ప్రేమికుల దినోత్సవం రోజున ఆత్మహత్య చేసుకున్న భార్య గుర్తుకురావడం వల్లే బానుచందర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడట. అయితే భార్య ఆత్మహత్య కారణమయ్యాడని జైలుపాలయిన వ్యక్తి భార్య గుర్తుకువచ్చిందంటూ ప్రేమికుల రోజుల ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం గమనార్హం.
ఇదిలావుంటే మరిదితో గొడవపడిన మహిళ ఆ కోపాన్ని భర్తపై ప్రదర్శించడంతో తీవ్ర మనస్థాపానికి గురయిన అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఆల్వాల్ లో చోటుచేసుకుంది.
ఆల్వాల్ లో నివసించే అంజయ్య(32) జిహెచ్ఎంసి చెత్త తరలింపు వాహనం డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం తండ్రి, తమ్ముడి వద్ద అప్పు తీసుకుని సొంతంగా ఇళ్లు కట్టుకున్నాడు. అయితే సకాలంలో ఈ అప్పు చెల్లించకపోవడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం అంజయ్య తమ్ముడు అప్పిచ్చిన డబ్బుల కోసం వదిన లక్ష్మమ్మ తో గొడవ పడ్డాడు. తీవ్రంగా వాగ్వాదం జరిగింది. దీంతో సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకు ఆమె జరిగిన గొడవ మొత్తం చెప్పింది.. ఇలా మాటలు పడడానికి, గొడవకు భర్తే కారణం అని కోప్పడింది. దీంతో మనస్థాపంతో అంజయ్య ఇంట్లో ఉరి వేసుకున్నాడు.
గతేడాది ఆగస్ట్ లో ఇలాగే భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో వెలుగుచూసింది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని తనను మానసికంగా వేధిస్తుందనే కారణంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా కొణిజర్లలోని రామనర్సయ్యనగర్ లో ఈ దారుణం చోటుచేసుకుంది.
