Asianet News TeluguAsianet News Telugu

కారణమిదీ: పీసీసీ చీఫ్ ఎంపికకు తాత్కాలిక బ్రేక్

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల కోసమే తెలంగాణ పీసీసీ చీఫ్ బాస్ ఎంపికకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టుగా కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

reasons behind break for tpcc new chief announcement lns
Author
Hyderabad, First Published Jan 6, 2021, 5:49 PM IST

హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల కోసమే తెలంగాణ పీసీసీ చీఫ్ బాస్ ఎంపికకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టుగా కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

వాస్తవానికి మంగళవారం నాడు పీసీసీకి కొత్త బాస్ ను ప్రకటిస్తారనే ప్రచారం సాగింది. కానీ కొత్త బాస్ ఎంపికను పార్టీ నాయకత్వం తాత్కాలికంగా బ్రేక్ వేసినట్టుగా సమాచారం.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరును టీపీసీసీ చీఫ్ గా ఖరారు చేశారని ప్రచారం సాగింది. కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కమిటీ ఛైర్మెన్ గా  రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేశారని ప్రచారం సాగింది.

అయితే  ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి రెండు కీలక పదవులను కట్టబెట్టడంపై  పార్టీలో కొందరు నేతలు పార్టీ నాయకత్వంతో చర్చించారని సమాచారం.

ఇదే విషయమై సీనియర్ నేత జానారెడ్డి పార్టీ కార్యదర్శి బోస్ రాజుతో చర్చించారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.అదే జరిగితే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన పార్టీ నాయకత్వం దృష్టికి వచ్చారు.

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ కేంద్రీకరించింది. ఈ ఉప ఎన్నికల్లో జానారెడ్డి కుటుంబం  నుండి ఎవరో ఒకరు బరిలోకి దిగనున్నారు.

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీసీ సామాజికవర్గం ఓటర్లు గెలుపు ఓటములను ప్రభావితం చేయనున్నారు. ఈ నియోజకవర్గంలో యాదవ సామాజికవర్గానికి సుమారు 40 వేల ఓటర్లు ఉంటారు.

గత ఎన్నికల సమయంలో నోముల నర్సింహ్మయ్య చేతిలోనే జానారెడ్డి ఓటమి పాలయ్యాడు. ఈ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో గెలుపు సాధించాలని ఆ పార్టీ కేంద్రీకరించి పనిచేస్తోంది. దీంతో పీసీసీకి కొత్త బాస్ ప్రకటన విషయాన్ని తాత్కాలికంగా బ్రేక్ పడినట్టుగా సమాచారం .

ఇదే విషయమై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఇవాళ మరోసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios