Asianet News TeluguAsianet News Telugu

కలెక్టర్ ఆదేశాలు: ఎలుకలు కొరికిన కరెన్సీ ఆర్బీఐకి


ఎలుకలు కొరికిన నగదును ఆర్బీఐ కార్యాలయానికి చేరుకొంది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన రైతు బూక్యా రెడ్యా కు చెందిన నగదు రూ. 2 లక్షలను ఎలుకలు కొరికాయి.ఈ నగదును ఆర్బీఐ కార్యాలయానికి పంపారు.

rat nibbled currency reaches to RBI lns
Author
Hyderabad, First Published Jul 20, 2021, 3:42 PM IST


మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని మానుకోట మండలం ఇందిరానగర్ కాలనీకి చెందిన రైతు  బూక్యా రెడ్యాకు చెందిన నగదును కొలుకలు కొరికాయి. ఈ నగదును హైద్రాబాద్ లోని ఆర్బీఐ కార్యాలయానికి పంపారు.బూక్యా రెడ్యా అనే రైతుకు చెందిన నగదు బీరువాలో దాచిపెట్టాడు. అయితే ఈ బీరువాలో దాచిన నగదును ఎలుకలు కొరికాయి. తాను ఆపరేషన్ కోసం  ఈ నగదును దాచిపెట్టుకొన్నాడు.ఈ విషయమై ఆయన  బ్యాంకుల చుట్టూ తిరిగినా కూడ ఫలితం లేకుండాపోయింది.

also read:షాక్: రూ. 4 లక్షలు కొట్టేసిన ఎలుకలు

ఈ విషయమై ఆయన కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషయం మీడియా ద్వారా మంత్రి సత్యవతి రాథోడ్ దృష్టికి వచ్చింది.  రెడ్యాకు అవసరమైన వైద్య సహాయంతో పాటు నగదును ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి ఆదేశం మేరకు జిల్లా కలెక్టర్ గౌతం కరెన్సీ నోట్లను హైద్రాబాద్ లోని రిజర్వ్ బ్యాంకు కు పంపి మార్పడి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్బీఐ కార్యాలయానికి చిరిగిన నోట్లను పంపారు. ఆర్బీఐ అధికారులు ఈ విషయమై ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios