Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో దారుణం... రోడ్డుపక్కన ఫుట్ పాత్ పైనే ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

రోడ్డుపక్కన ఫుట్ పాత్ పై తల్లితో కలిసి నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి యత్నించాడు. ఇది గమనించిన ఓ ఆటోడ్రైవర్ చిన్నారిని కామాంధుడి బారినుండి కాపాడాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

rape attempt on six years old child in hyderabad
Author
Hyderabad, First Published Nov 25, 2021, 10:41 AM IST

హైదరాబాద్:  అభం శుభం తెలియని ఓ చిన్నారిని కామాంధుడి బారినుండి కాపాడాడు హైదరబాదీ ఆటోడ్రైవర్. దీంతో సదరు ఆటోడ్రైవర్ ను తన కార్యాలయానికి పిలిపించుకుని అభినందించిన హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ జ్షాపికను కూడా అందజేసారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. hyderabad హఫీజ్ పేటలో నివాసముండే ఓ మహిళ ఇద్దరు కూతుళ్లతో కలిసి నాంపల్లిల్లోని యూసిఫియాన్ దర్గా వద్ద నిత్యం భిక్షాటన చేస్తుంటుంది. తల్లీకూతుళ్లు ప్రతిరోజూ ఉదయమే ఎంఎంటిఎస్ రైలులో nampally కి వచ్చి బిక్షాటన చేసుకుని తిరిగి అదే MMTS Train లో hafeezpet కు తిరిగి వెళుతుంటారు. ఇలా మంగళవారం కూడా ఇద్దరు కూతుళ్లను తీసుకుని మహిళ నాంపల్లికి వచ్చింది. 

అయితే సాయంత్రం సమయంలో అబిడ్స్ లో వుండే సోదరుడికి కలిసేందుకు వెళ్లింది సదరు మహిళ. అక్కడ ఆలస్యం కావడంతో నాంపల్లి నుండి లింగపల్లి వైపు వెళ్లే చివరి ఎంఎంటీఎస్ రైలు మిస్సయ్యింది. దీంతో ఇద్దరు కూతుళ్లతో సహా మహిళ, ఆమె సోదరుడు అబిడ్స్ లో పుట్ పాత్ పై పడుకున్నారు. 

read more  హైదరబాద్ శివారులో దారుణం... వృద్దురాలిపై ఇద్దరు దుండగుల అత్యాచారం, హత్య

అర్ధరాత్రి సమయంలో వీరంతా గాఢనిద్రలో వుండగా అప్జల్ గంజ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ చోటూ అటువైపు వచ్చి ఫుట్ పాత్ పై పడుకున్నవారిని చూసాడు. తల్లిపక్కన నిద్రిస్తున్న ఆరేళ్ల పాపపై అతడి కన్ను పడింది. ఆ పాపపై అక్కడే అఘాయిత్యానికి యత్నించగా ఆటోడ్రైవర్ సయ్యద్ జాహిద్ గమనించాడు. వెంటనే అక్కడికి చేరుకుని ఎలాంటి అఘాయిత్యం జరక్కుండా చిన్నారిని కాపాడాడు. మహిళతో పాటు ఆమె సోదరుడిని నిద్రలేపి విషయం తెలిపాడు. 

దీంతో వారంతా కలిసి చోటూను పట్టుకోగా తప్పించుకోడానికి ప్రయత్నించాడు. ఇదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అటువైపు వచ్చి చోటూను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిపై అఘాయిత్యానికి యత్నించిన ఛోటూపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

read more  కిలాడీ కపుల్... ఫేస్ బుక్ లో పరిచయమై, ప్రేమపేరుతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను ముగ్గులోకి దింపి, కోటి స్వాహా....!

చిన్నారిపై అఘాయిత్యం జరక్కుండా అడ్డుకున్నట్లు తెలుసుకున్న హైదరాబాద్ సిపి అంజనీకుమార్  ఆటోడ్రైవర్ జాహిద్ ను తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. అతడిని ప్రత్యేకంగా అభినందించిన సిపి జ్ఞాపికను కూడా  అందజేసారు. 

మానవ సంబంధాలకే మచ్చ... కన్నకూతురినే గర్భవతిని చేసిన తండ్రి

ఇదిలావుంటే ఇదే హైదరాబాద్ శివారులో మరో దారుణం వెలుగుచూసింది. వావివరసలు మరిచిన ఓ కసాయి తండ్రి కంటికిరెప్పలా కాపాడుకోవాల్సిన కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే కట్టుకున్నవాడే కన్నకూతురి జీవితాన్ని నాశనం చేయడాన్ని ఉపేక్షించని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగుచూసింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.  

మోమిన్ పేట్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం పఠాన్ చెరుకు వెళ్లి అక్కడే ఉంటున్నారు. వీరి కుమార్తె కస్తూర్బా విద్యాలయంలో చదువుకుంటుంది. అయితే కరోనా కారణంగా ఇంటివద్దే వుంటున్న కూతురిపై కన్నేసాడు కసాయి తండ్రి.  ఒంటరిగా ఉన్న కూతురిని బెదిరించి మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. 

అయితే ఇటీవల కూతురు నీరసంగా ఉండటాన్ని గమనించిన తల్లి నాలుగు రోజుల క్రితం స్థానిక హాస్పిటల్ కి తీసుకువెళ్ళింది. అక్కడి వైద్యులు బాలికను పరీక్షలు నిర్వహించి ఆమె గర్భవతిగా తేల్చారు. దీంతో  తండ్రే తన మీద అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక బయటపెట్టింది. మంగళవారం రాత్రి తల్లి మోమిన్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios