సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వర్ణలత తన భవిష్యవాణి వినిపించారు. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతారని ఆమె చెప్పారు.

హైదరాబాద్: సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో సోమవారం ఉదయం రంగం జరిగింది. ఏటా ఈ ఆలయంలో రంగం జరుగుతుంది. ఇందులో భాగంగా స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తారు. ఆమెను అమ్మవారు ఆవహిస్తుందని, ఆ అమ్మవారు భవిష్యవాణి చెబుతారని భక్తులు నమ్ముతారు. ఈ ఏడాది కూడా ఆమె తన భవిష్యవాణి వినిపించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

మహమ్మారి ఇబ్బంది పట్టినా ప్రజలు తనను నమ్మినందుకు, తనకు పూజలు చేసినందుకు సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. వర్షాల వల్ల రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతారని ఆమె చెప్పారు. భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా, వారికి ఏ ఆపదా రాకుండా చూసుకునే భారం తనదని ఆణె చెప్పారు. 

ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.