ఆదిలాబాద్: కారు ప్రమాదంలో కాంగ్రెసు ఆదిలాబాద్ లోకసభ అభ్యర్థి రమేష్ రాథోడ్ తీవ్రంగా గాయపడ్డారు.  ఆయన ప్రయాణిస్తున్న కారు మావల బైపాస్ వద్ద చెట్టును ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో రమేశ్ రాథోడ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. రమేశ్ రాథోడ్‌కు వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు. 

ఎదురుపడిన జంతువులను తప్పించబోవడంతో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో రమేష్ రాథోడ్ తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. కారు డ్రైవర్, రమేష్ రాథోడ్ గన్ మన్ కూడా గాయపడ్డారు.