టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ములుగు ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టారు. గురువారం హైదరాబాద్‌లోని రేవంత్ ఇంటికి వెళ్లిన ఆమె.. రేవంత్‌కు రాఖీ కట్టి స్వీట్స్ తినిపించారు.

రక్షాబంధన్ పర్వదినాన్ని దేశ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టి ఆశీర్వదిస్తున్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ములుగు ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టారు. గురువారం హైదరాబాద్‌లోని రేవంత్ ఇంటికి వెళ్లిన ఆమె.. రేవంత్‌కు రాఖీ కట్టి స్వీట్స్ తినిపించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మనవడితో సీతక్క ఆడుకున్నారు. ‘రాజకీయాలతో పరిచయమైన ఈ బంధం… రాజకీయాలకి అర్థం కానంత పవిత్రమైన బంధంగా మారింది. నా ప్రతి అడుగులో నాకు తోడుగా ఉంటున్న ప్రతి ఒక్క సోదరుడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు’ అని సీతక్క ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

కాగా.. టీడీపీలో వున్నప్పటి నుంచి రేవంత్‌తో సీతక్కకు ప్రత్యేక అనుబంధం వుంది. ఆయనకు కుటుంబానికి ఆత్మీయురాలిగా మారిపోయింది. రేవంత్ తెలుగుదేశం పార్టీని వీడిని తర్వాత ఆయన వెంట కాంగ్రెస్‌లో చేరారు సీతక్క. ప్రతియేటా రాఖీ పర్వదినం నాడు ఆయనకు రక్షాబంధన్ కడుతూ వస్తున్నారామె. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక సభ్యురాలిగా మారారు సీతక్క.

ములుగు నియోజవవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆదర్శవంతంగా సేవ చేస్తున్నారు సీతక్క. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఆమె అందించిన సేవలు వెలకట్టలేనివి. నియోజకవర్గ ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని పలువురు చెబుతూ వుంటారు. రాజకీయాల్లో చేరడానికి ముందు పదిహేనేళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపారు సీతక్క. ప్రస్తుతం కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా ఆమె వ్యవహరిస్తున్నారు.

Scroll to load tweet…

ఇకపోతే.. రక్షా బంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మలు రాఖీ కట్టి ఆశీర్వదించారు. ప్రతి యేటా రాఖీ పండుగ నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి ఆయన అక్కలు చేరుకుని తమ సోదరుడికి రాఖీ కట్టి ఆశీర్వదిస్తూ వస్తున్నారు. అంతకుముందు ఉదయం మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌లకు వారి సోదరి , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు.