ఐదుగురు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులపై ఫిర్యాదు.. ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేసిన చైర్మన్ ధన్‌కర్
బీఆర్ఎస్‌కు చెందిన ఐదుగురు రాజ్యసభ సభ్యులపై బీజేపీ ఎంపీ ఒకరు సభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో జగదీప్ ధన్‌కర్ ఆ ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశారు.
బీఆర్ఎస్‌కు చెందిన ఐదుగురు రాజ్యసభ సభ్యులపై బీజేపీ ఎంపీ ఒకరు సభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో జగదీప్ ధన్‌కర్ ఆ ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశారు. సెప్టెంబర్ 18న రాజ్యసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ సభ్యుల ప్లకార్డులు ప్రదర్శించారని.. జగదీప్ ధన్‌కర్‌కు బీజేపీ నేత వివేక్ ఠాకూర్ ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కే కేశవ రావుతో దామోదర్ రావు, రవిచంద్ర వద్దిరాజు, కేఆర్ సురేష్ రెడ్డి, బీ లింగయ్య యాదవ్‌ల పేర్లను వివేక్ ఠాకూర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యసభలో రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ రూల్ 188 కింద నోటీసును దాఖలు చేశారు.
2023 సెప్టెంబర్ 18న రాజ్యసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ సభ్యులు "అవమానకరంగా" ప్లకార్డులను ప్రదర్శించారని.. తద్వారా సభ్యుల కోసం స్థిరపడిన ప్రవర్తనా నియమాలను పూర్తిగా ఉల్లంఘించడం, తద్వారా సభ కార్యకలాపాల్లో అనవసరమైన ఆటంకాలు కలిగించడం, సభ గౌరవాన్ని తగ్గించడం చేశారని వివేక్ ఠాకూర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే ఈ ఫిర్యాదుపై రాజ్యసభ చైర్మన్ కార్యాలయం స్పందించింది. రాజ్యసభలో విధివిధానాలు, వ్యాపార ప్రవర్తన యొక్క నియమాలు 203 కింద ఈ విషయాన్ని పరిశీలన, దర్యాప్తు, నివేదిక కోసం ప్రివిలేజెస్ కమిటీకి సిఫార్సు చేయడం జరిగిందని రాజ్యసభ సెక్రటేరియట్ నుండి అధికారిక సమాచారం వెలువడింది.