తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మజ్లీస్ పార్టీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని బిజెపి తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. అయితే ఇప్పటివరకు మజ్లీస్ పార్టీ ఎవరితో కలిసుంటే వారికి నష్టమే జరిగిందని...ఈ విషయాన్ని గుర్తించి కేసీఆర్ మరోసారి పునరాలోచించుకోవాలని రాజాసింగ్ సూచించారు.

ఇవాళ రాజ్ భవన్ లో జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజాసింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ... రెండోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ముఖ్యమంత్రిగా ఆయన పార్టీలకతీతంగా పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాని రాజాసింగ్ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలు ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చారు...కాబట్టి వారు ఎవరితోనైనా కలిసి పనిచేయవచ్చని అన్నారు. కానీ ఎలాంటి వారితో కలిసి వుంటే రాష్ట్రానికి మంచి జరగుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రాజాసింగ్ సలహా ఇచ్చారు.
తెలంగాణ వ్యాప్తంగా బిజెపి పోటీ చేసిన 199 నియోజకవర్గాల్లో కేవలం గోషామహల్ లో ఒక్కచోటే రాజా సింగ్ గెలుపొందారు. గతంలో బిజెపికి నగరంలో ఐదు చోట్ల ప్రాతినిధ్యం ఉండగం ప్రస్తుతం ఒకటికి తగ్గింది. ఇదే సమయంలో మరోసారి ఎంఐఎం తమ 7 సిట్టింగ్ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో టీఆర్ఎస్‌కు బయటి నుండి ఎంఐఎంలు మద్దతిస్తోంది. దీంతో టీఆర్ెస్ పార్టీ ఎంఐఎంకు దూరంగా ఉండాలంటూ రాజాసింగ్ సలహా ఇచ్చారు.